Chinthapalli : సాయి సన్నిధిలో సినీ నటులు శ్రీకాంత్, తరుణ్..!
Chinthapalli : సాయి సన్నిధిలో సినీ నటులు శ్రీకాంత్, తరుణ్..!
చింతపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లాలో మరో శిరిడి దేవాలయంగా చింతపల్లి సాయిబాబా దేవాలయం భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చందన ఉందని సినీ నటులు శ్రీకాంత్, తరుణ్ పేర్కొన్నారు. ఆదివారం చింతపల్లి మండల కేంద్రానికి సమీపంలో గల ఆరు, శ్రీ మిత్ర నూతన వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంచి కంటి ధనంజయ, ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలికి వేద బ్రాహ్మణులచే ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం వారు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంతం హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై నెలకొల్పినటువంటి ఈ సాయిబాబా మందిరం భవిష్యత్తులో మరో షిరిడిగా మారనున్నదని వారు పేర్కొన్నారు.
సాక్షాత్ షిరిడి సాయిబాబా అనే ఈ ప్రాంతంలో కొలువై ఉన్నాడా అనే నిదర్శనం కనిపిస్తుంది అన్నారు. ముఖ్యంగా గోశాలను ఏర్పాటు చేసి హిందూ ధర్మ పరిరక్షణ కాపాడేందుకు దేవాలయ కమిటీ నిర్వాహకులు చేస్తున్న కృషి అమోఘం అన్నారు.ప్రతి ఒక్కరు దైవ భక్తితో ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధికి మరింత సహాయ సహకారాలు అందించాలని వారు పేర్కొన్నారు.
ముఖ్యంగా ప్రతినిత్యం భక్తులకు అన్నదానం అందించడం గొప్ప విశేషం అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంచి కంటి ధనంజయ దేవాలయానికి చేస్తున్న సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రధాన కార్యదర్శి కోమిరిశెట్టి వెంకటయ్య. కోశాధికారి ఊరే కృష్ణయ్య. కుంభం పుల్లారెడ్డి. తడకమల్ల శ్రీనివాస్ వేదపండితులు తదితరులు పాలుగోన్నారు.
MOST READ :
-
New Scheme : రైతులకు శుభవార్త.. రూ.600 కోట్లతో కొత్త పథకం..!
-
Viral Video : పీహెచ్డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్మకం.. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ఏం చేశారంటే..!
-
Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా..!
-
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నెలాఖరు లోపు వారికే ఇందిరమ్మ ఇండ్లు..!









