Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ప్రభుత్వం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి.. డి.ఎస్.పి పిలుపు..!

Miryalaguda : ప్రభుత్వం చేసే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి.. డి.ఎస్.పి పిలుపు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని జనయే త్రీ ఫౌండేషన్, మిర్యాలగూడ షి టీమ్ ఆధ్వర్యంలో కైరేలి పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన డ్రగ్స్,ఆన్లైన్ బెట్టింగ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ముఖ్యంగా యువకులు తమ జీవితాలు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా 9,10 తరగతులు ఒక మలుపు అన్నారు. విద్యార్థులు, యువత బుద్ధిగా చదువుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటే వారి జీవితం బాగుపడుతుందన్నారు. ప్రభుత్వం మాదకద్రవ్యాల అక్రమ రవాణా,దుర్వినియోగం పై చేస్తున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.

మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి బాధ్యత అన్నారు.యువత డ్రగ్స్‌, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల దైనందిన విషయాలపై దృష్టి పెట్టకుండా క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారి, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం ప్రతీ ఒక్కరు గమనించాలన్నారు.

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని, ఇప్పటి నుంచే తమ భవిష్యత్తుకు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చదువుకోవాలని, చెడు మార్గంలో వెళ్లొద్దని సూచించారు. డ్రగ్స్‌ అమ్మకం, కొనుగోలు చేసే ఎలాంటి వ్యక్తుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా ట్రోల్‌ ఫ్రీ నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలన్నారు.

ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత తన జీవితాన్ని నాశనం చేసుకోకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సదస్సులో షీ టీం ఎస్సై నరేష్, ఏఎస్ఐ బిక్షం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు కొర్ర కృష్ణ కాంత్ నాయక్, వడ్త్య వెంకట్ రామ్, ఫౌండేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు పల్లె కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి, తాజ్ బాబా, ఫౌండేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు జాజాల కృష్ణ, ఫౌండేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, కైరేలి పాఠశాల కరస్పాండెంట్ షేక్ అహ్మద్,

డాక్టర్ బాలాజీ, అడ్వకేట్లు జాకీర్, శ్రీధర్ గౌడ్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి, వరంగల్ జిల్లా జన యేత్రి ఫౌండేషన్ అధ్యక్షులు రహీం ఖాన్, ఆరీగుద్దీన్, యాదగిరి, షాహిద్, రఫీ చరణ్ రాఘవ, అలీముద్దీన్, అమీర్ అలీ, రషీద్ , సోహేల్ , హేమ్ల, అభినందన సందీప్ షేర్ హౌస్, లింగరాజు, విజయ్, సైదులు, ద్రోణాచారి లక్ష్మణ్ మస్తాన్ అంజి, తదితరులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు