Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : పది నెలలుగా పస్తులు.. దీపావళి పండుగకు అయినా అందేనా..!

Nalgonda : పది నెలలుగా పస్తులు.. దీపావళి పండుగకు అయినా అందేనా..!

కనగల్, మన సాక్షి :

మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు లైన్మెన్ లకు పది నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితులు దాపురించాయి. గత ప్రభుత్వ హయాంలో ఆర్డబ్ల్యూఎస్ లో పనిచేస్తున్న కార్మికులను మిషన్ భగీరథులోకి మార్చారు.

పథకం పేరు మారిందే కానీ వారి తలరాతలు మారలేదు. కాంట్రాక్టు పద్ధతిలో వీరిని తీసుకొని ఏజెన్సీలు శ్రమదోపిడికి పాల్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. పెద్ద పండుగ అయిన దసరాకు సైతం గీతాలు రాకపోవడంతో వారి కుటుంబాల్లో తీరని నిరాశ మిగిలింది. రోజువారి ఖర్చులకోసం పలువురి దగ్గర అప్పులు చేసి బతుకు నెట్టుకొస్తున్నారు.

నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా పది నెలల నుంచి జీతాలు రాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. నల్లగొండ నియోజకవర్గంలో 600 పై చిలుకు మంది మిషన్ భగీరథ పథకంలో ఆపరేటర్లు, లైన్మెన్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. లైన్మెన్ లు నెలకు రూ 10,500 నామమాత్రపు వేతనంతో పని చేస్తూ అర్ధాకలితో అలమటిస్తున్నారు.

ఈ దీపావళి పండుగకు అయిన జీతాలు అందించాలని వారు అధికారులను కోరుతున్నారు. నెల నెల తమ అకౌంట్లో జీతాలు వేయడంతో పాటు కనీస వేతనం అమలు చేయాలన్నారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వమే బీమా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు