Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad :  ఓఆర్‌ఆర్‌ టు కొండాపూర్‌.. విస్తరణ పనులు..!

Hyderabad :  ఓఆర్‌ఆర్‌ టు కొండాపూర్‌.. విస్తరణ పనులు..!

శేరిలింగంపల్లి , మన సాక్షి:

జిహెచ్ఎంసీ నూతన కమీషనర్‌ ఇలంబర్తి బుధవారం శేరిలింగంపల్లి జోన్‌లో తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా గచ్బిబౌలిలో నూతనంగా నిర్మాణం అవుతున్న శిల్పా లే అవుట్‌ ఫ్లె ఓవర్‌ ఫేజ్‌ 2 పనులను హెచ్‌ఎండీఏ కమీషనర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌, ప్రాజెక్టు సీఈ దేవానంద్, జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డిలతో కలిసి నూతన కమిషనర్‌ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్‌ నుంచి కొండాపూర్‌ వరకు పనులను, తొలగించాల్సిన విద్యుత్‌ స్తంబాలు, విస్తరించాల్సిన రహదారులను చూసారు. అనంతరం కమీషనర్‌ ఇలంబర్తి మాట్లాడుతూ ఫై ఓవర్‌ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు.

నిత్యం ట్రాఫిక్‌తో ఉండే కీలక రహదారిపై ఈ పనులు జరుగుతున్నందున జాప్యం చేయవద్దని, గుత్తేదారు త్వరిత గతిన పూర్తి చేసేలా కృషి చేయాలని ఆదేశించారు. రహదారి విస్తరణకు ఆటంకంగా ఉన్న విద్యుత్‌ స్తంబాలు కేబుళ్ల మార్పులో సంబంధిత శాఖ నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు.

ర్యాంపు నిర్మాణం నిమిత్తం తాత్కాలిక రహదారి నిర్మాణానికి విద్యుత్‌ కేబుళ్ల మార్పుతో ముడిపడి ఉన్నందున అధికారులు పనులను వేగవంతం చేయాలని కమీషనర్‌ ఇలంబర్తి స్పష్టం చేసారు. పై వంతెన నిర్మాణ పనులను అధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ పురోగతి నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

కూడళ్ల అభివృద్ధి సుందరీకరణ పనులతో పాటు సర్వీసు రహదారుల నిర్మాణ ప్రక్రియను వేగం చేయాలని కమీషనర్‌ ఇలంబర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGSPDCL అధికారులు జోన్ అధికారులు పాల్గొన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు