Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Paddy : సన్న ధాన్యానికి బోనస్ తో క్వింటాకు రూ. 2820..!

Paddy : సన్న ధాన్యానికి బోనస్ తో క్వింటాకు రూ. 2820..!

కంగ్టి, మన సాక్షి:

రైతుల శ్రేయస్సు కోసం కృషి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పరిధిలోని తడ్కల్, జమ్గి కే గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …రైతులు ఆధైర్య పడవద్దు అని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని వికరిస్తే మద్దతు ధర అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. వరికి కనీస మద్ధతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్ రూ.2320, బి గ్రేడ్ రూ.2300, సన్న వడ్ల రూ.2320 బోనస్ రూ.500 మొత్తం రూ.2820 ప్రభుత్వం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

తడ్కల్ లో సన్న వడ్ల కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఎమ్మెల్యే సంజీవరెడ్డికు విజ్ఞప్తి చేశారు. సన్న వడ్ల కేంద్రం పై అధికారులకు సంప్రదించి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి,ఏపిఎం కిష్టయ్య, ఏఈవో హన్మండ్లు మహిళా సమైక్య అధ్యక్షురాలు మహానంద,సీసీలు రేణుక, సంతోష్, వల్లప్ప, అనుసుజ, తుకారం,వివోలు సుమ, సావిత్రి, గంగామణి, షహీన్ బేగం, మాజీ ఎంపిటిసి బలప్ప, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ హమీద్, నాయకులు పెద్ద మల్లారెడ్డి, మనోహర్, కృష్ణారెడ్డి, తట్టి వీరేశం, చాకలి అంబయ్య, రాములు, మాధవరావు, సమీర్, ఎస్ఐ విజయ్ కుమార్ రైతులు తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు