CCI : సీసీఐ కేంద్రంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు.. ఆర్డీఓ శ్రీరాములు..!
CCI : సీసీఐ కేంద్రంలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు.. ఆర్డీఓ శ్రీరాములు..!
చింతపల్లి, మనసాక్షి:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి షరతులు విధించకుండా పత్తి కొనుగోలును సి సి ఐ చేపట్టాలని ఆర్డిఓ శ్రీరాములు పేర్కొన్నారు. శుక్రవారం చింతపల్లి మండల పరిధిలోని శివ సాయి సిసి కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు మధ్య దళారులను, బ్రోకర్లును ఆశ్రయించకుండా నేరుగా సీసీఐ కేంద్రాలకు పండించిన పత్తిని విక్రయించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
తేమ లేకుండా రైతులు ఆరబెట్టిన పత్తిని విక్రయించుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని వారు సూచించారు. సీసీఐ కేంద్రంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్న కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం మద్దతు ధర క్వింటాకు 7,500. 25 రూపాయలు కేటాయించడం జరిగిందని అందుకు రైతులు దళారులు ఆశ్రయించకుండా నేరుగా రైతుల ఖాతాలోకి వచ్చే విధంగా ప్రభుత్వం చేపట్టిన విధానాలు పాటించాలి అన్నారు. ప్రారంభించిన సీసీ కేంద్రాలు రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. వీరి వెంట ఆర్ఐ సునీత, రెవెన్యూ సిబ్బంది ప్రశాంత్, తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలి..!
-
Viral Video : లవ్ రెడ్డి సినిమా చూసి ప్రేక్షకురాలు ఎమోషన్.. నటుడు NT రామస్వామి పై థియేటర్ లోనే మహిళ దాడి.. ( వీడియో)
-
Paddy : సన్న ధాన్యానికి బోనస్ తో క్వింటాకు రూ. 2820..!
-
Phonepe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇది అస్సలు మిస్ చేసుకోకండి..!









