Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price : గోల్డెన్ డేస్.. దీపావళికి మరోసారి షాక్, తులం బంగారం ధర ఎంతంటే..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఇప్పుడు దేశవ్యాప్తంగా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. రోజు రోజుకు బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది. బంగారం ఉన్న వాళ్లకు ఇవి గోల్డెన్ డేస్ గా చెప్పవచ్చును. మరింత ధర పెరుగుతుందని కొనుగోలుదారులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు. కానీ దీపావళికి మాత్రం విపరీతంగా ధరలు పెరిగి షాక్ తింటున్నారు.

హైదరాబాదులో బంగారం ధర బుధవారం (అక్టోబర్ 30) ఒక్కరోజే 100 గ్రాములకు రూ.7100 పెరిగింది. మంగళవారం (అక్టోబర్ 29)వ తేదీన 24 క్యారెట్స్ గోల్డ్ హైదరాబాద్ లో 10 గ్రాములకు 80,450 రూపాయలు ఉండగా గురువారం (అక్టోబర్ 30)వ తేదీన రూ.710 పెరిగి 81,160 రూపాయలకు చేరింది.

22 క్యారెట్స్ బంగారం హైదరాబాదులో (అక్టోబర్ 29) మంగళవారం 73, 750 రూపాయలు ఉండగా (అక్టోబర్ 30) బుధవారం 650 రూపాయలు పెరిగి 74,400 రూపాయలకు చేరింది.

హైదరాబాదులో బుధవారం బంగారం ధరల వివరాలు :

24 క్యారెట్స్ :

ఒక గ్రాముకు రూ.8116

8 గ్రాములకు 64, 928 రూపాయలు

10 గ్రాములకు 81,160 రూపాయలు

100 గ్రాములకు 8,11,600 రూపాయలు

22 క్యారెట్స్ బంగారం ధర :

ఒక గ్రాముకు రూ. 7440

8 గ్రాములకు 59,520 రూపాయలు

10 గ్రాములకు 74, 400 రూపాయలు

100 గ్రాములకు 7,44,000 రూపాయలు.

MOST READ : 

మరిన్ని వార్తలు