Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : అంగన్వాడి కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు పంపిణీ..!

Nalgonda : అంగన్వాడి కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు పంపిణీ..!

వేములపల్లి, మన సాక్షి :

గర్భిణీ స్త్రీలకు పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం కోసం బాలామృతం పథకం ద్వారా ప్రభుత్వం కోడిగుడ్లను పంపిణీ చేస్తుంది. కొన్ని ఏజెన్సీల ద్వారా అంగన్వాడి కేంద్రాలకు కోడిగుడ్లు ప్రభుత్వం సరఫరా చేస్తుంది.

నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామంలో నీ అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు గుడ్లను పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళిన లబ్ధిదారులు వాటర్ లో గుడ్లను వేసి చూడగా అవి పైకి తేలడం గమనించిన లబ్ధిదారులు వాటిని పగలగొట్టి చూడగా వాటి నుండి దుర్వాసన అది కుళ్ళిపోయి ఉండడం గమనించిన లబ్ధిదారులు వాటిని ఫోటోలు వీడియోలు తీశారు.

ఒకవేళ ఇవి మేము గమనించకుండా ఉంటే వీటిని గర్భిణీ స్త్రీలు పిల్లలు తింటే వాళ్లకు జరగరా నిది ఏదైనా జరిగితే మా పిల్లలకు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.

దీనిపైన సంబంధిత అధికారులు చొరవ తీసుకొని అంగన్వాడి కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీలు నాణ్యమైన గుడ్లు సరఫరా చేయకపోవడం వలన లేక అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వ ఉంచడం వలన అనేదాని పైన అధికారులు సందర్శించి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఇప్పటికైనా నాణ్యమైన గుడ్లను పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు