Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కొడుకుకు గాయాలు.. న్యాయం కోసం రహదారిపై ధర్నా..!

దేవరకొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కొడుకుకు గాయాలు.. న్యాయం కోసం రహదారిపై ధర్నా..!

దేవరకొండ, మనసాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకు గాయాలయ్యాయి. వివరాల ప్రకారం..

మాడుగుల మండలం అందుగుల గ్రామానికి చెందిన
అవాంచ శేఖర్ చారి(40) తన కుమారుడితో దేవరకొండ లోని అయ్యప్ప స్వామి దేవాలయం కు స్వామి మాల ధరించేందుకు బుధవారం తెల్లవారుజామున వచ్చారు. దేవాలయం ముందు టూ వీలర్ పై ఉన్న వారిని అశోక్ లేలాండ్ లారీ ఢీ కొట్టింది.

దాంతో ఇరువురిని ఆసుపత్రికి తరలించగా శేఖర్ కు సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. కాగా గురువారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

న్యాయం చేయాలని బంధువుల ధర్నా, రాస్తారోకో :

మాడుగుల మండలం అందుగుల గ్రామానికి చెందిన అవాంచ శేఖర్ చారి బ్రతుకు దెరువు కోసం కల్వకుర్తికి వెళ్లి బంగారం షాపు పెట్టుకుని జీవనాధారం సాగుస్తున్నారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. దాంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు