తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : జిల్లా కలెక్టర్ పై దాడికి రెవెన్యూ ఉద్యోగుల నిరసన..!

Miryalaguda : జిల్లా కలెక్టర్ పై దాడికి రెవెన్యూ ఉద్యోగుల నిరసన..!

మన సాక్షి, మిర్యాలగూడ :

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దుద్యాల మండలం లగచర్లలో జరిగిన దాడిని ఖండిస్తూ మిర్యాలగూడలో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ తహసిల్దార్ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ పై దాడి చేసిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో మిర్యాలగూడ తహసిల్దార్ హరిబాబు, అడవిదేవులపల్లి తహసిల్దార్ సురేష్ కుమార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, సత్యనారాయణ, ఏఎస్ఓ రవీందర్ రెడ్డి, ఉద్యోగులు మృదుల, అనిత, సంధ్య, తిరుమలేష్, కళ్యాణి, సైదులు, సత్య, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు