Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Suryapet : రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Suryapet : రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు జమ చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి :

ధాన్యం సేకరణ పక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి, బాలెంలా, రామన్నగూడెం,పిఎసిఎస్, ఐకెపి నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

రైతులు తరలించిన ధాన్యం నిల్వలను, వాటి నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. మాశ్చరైజ్ మీటర్ ద్వారా ధాన్యం తేమశాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ధాన్యం కోనుగోలు అనంతరం మిల్లులకు రవాణా దిగుమతి వేగంగా జరగాలని టాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రైతులకు 48 గంటల్లో డబ్బులు వారి ఖాతాలో జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, పిఎసిఎస్ సీఈవో శ్యాంసుందర్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు