Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య
Miryalaguda : ఎస్ వి మోడల్ హైస్కూల్లో బాలల దినోత్సవం..!
Miryalaguda : ఎస్ వి మోడల్ హైస్కూల్లో బాలల దినోత్సవం..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్ లోని ఎస్ వి మోడల్ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చాచా నెహ్రూ వేషధారణలతో వచ్చిన చిన్నారులను పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ ఆశీర్వదించి బహుమతి ప్రధానం చేశారు. పిల్లలకు చాచా నెహ్రూ జన్మదిన వేడుకల గురించి తెలుపుతూ నేటి బాలలే రేపటి పౌరులనీ , దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ తెలిపారు.
చాచా నెహ్రూ పై జరిపిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రతి విద్యార్థి చాచా నెహ్రూ నియమాలు పాటించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి లతోపాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
Miryalaguda : శివాని హైస్కూల్లో.. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..!
-
Miryalaguda : శిష్య స్కూల్లో ఘనంగా బాలలదినోత్సవ వేడుకలు..!
-
TGSRTC : కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాలలో ప్రత్యేక బస్సులు..!
-
Family Survey : విద్యార్థులచే సమగ్ర సర్వే.. నిలదీసిన ఇంటి యజమాని.. (వీడియో వైరల్)









