Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు..!
Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త.. వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డుదారులకు ఈ వార్త ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రేషన్ కార్డు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలుసు. పేద, మధ్యతరగతి వర్గాల వారికి రేషన్ కార్డు ద్వారా పలు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. దాంతో రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాష్ట్రంలో అనేక మంది పేదలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు.
10 సంవత్సరాల క్రితం మంజూరైన రేషన్ కార్డులలో తమ కుటుంబ సభ్యులు అందరి పేర్లు లేకపోవడంతో పేద మధ్యతరగతి వర్గాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పెళ్లయిన వారు కూడా తమ భార్య పేరు, పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులో లేకుండా ఉన్నారు. తమ పిల్లల పేర్లు ఇంకా రేషన్ కార్డులో లేవని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారందరికీ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది.
మీసేవ సెంటర్ లో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేర్చుకునే అవకాశం కల్పించారు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు లేకుంటే దానికి సంబంధించిన పత్రాలు అందజేస్తే సరిపోతుంది. పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు, పుట్టిన సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంది. వివాహమైన వారైతే భార్య పేరు కూడా రేషన్ కార్డులో లేకుంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అందజేసి రేషన్ కార్డులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి మీసేవ సెంటర్ లో సాధారణ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారిక వెబ్ సైట్ ద్వారా మీరు రేషన్ కార్డు ఆప్షన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చును. దాంతోపాటు కొత్త రేషన్ కార్డులకు త్వరలో దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
MOST READ :
-
Gold Price : పసిడి ధర తగ్గుదలకు బ్రేక్ లేదు.. మరింత తగ్గిన బంగారం ధర..!
-
Groups : గ్రూప్ – 3 పరీక్ష రాసే వారికి గుర్తింపు కార్డు తప్పనిసరి..!
-
Ration Card : రేషన్ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్..!
-
Miryalaguda : చేప పిల్లలు నాణ్యత లేవని కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం..!
-
Damodara Rajanarsimha : కూత పెట్టిన మంత్రి రాజనర్సింహ.. కేరింతలు..!









