జాతీయంBreaking Newsరాజకీయం

Nalgonda : నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ఎంపి రఘువీర్ వినతి..!

Nalgonda : నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి రూ.100 కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రికి ఎంపి రఘువీర్ వినతి..!

నల్గొండ, మన సాక్షి :

నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రానికి 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని కోరుతూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ కి గురువారం ఢిల్లీలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.

సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే నిధుల విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన పానగల్, రాచకొండ, దేవరకొండ ఖిల్లాలకు కూడా టూరిజం డెవలప్మెంట్ కింద ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు