Khammam : వేతనాల కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా..!
Khammam : వేతనాల కోసం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా..!
ఖమ్మం, మన సాక్షి :
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు, ఐయఫ్ టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణు వర్ధన్,TUCI జిల్లా కార్యదర్శి జి.రామయ్య లు మాట్లాడుతూ…
చాలీచాలని జీతంతో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీతాలు వస్తేనే వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితులు ఉన్నాయని ఇంటి అద్దెలు చెల్లించలేక ఇంటి యజమానులు కార్మికుల్ని ఖాళీ చేయమని తిడుతున్నారు.
పెరిగిన ధరలతో కార్మికుల కుటుంబాలు గడవడం తీవ్ర ఇబ్బందులుగా ఉంది. సెలవులు పెట్టుకొని రోజువారి కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని జీతాలు ఇవ్వండని కాంటాక్ట్ ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జీతాలు ఇవ్వని కాంట్రాక్టర్ పై చర్యలు వెంటనే తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సూపరిండెంట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సూపరింటెండెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. జీతాలు వెంటనే చెల్లించాలని లేకపోతే ఖమ్మంలో మంత్రి కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు వై విక్రం జిల్లా నాయకులు కే శ్రీనివాస్ యూనియన్ నాయకులు విజయమ్మ , వెంకటరమణ, అశోక్, అంబేద్కర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!
-
Teacher : ఎంత పని జరిగింది.. క్లాసులోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు..!









