Nalgonda : వర్మి కంపోస్టు తయారీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!
Nalgonda : వర్మి కంపోస్టు తయారీ చేయాలి.. జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి :
డంపింగ్ యార్డుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ వర్మి కంపోస్టు తయారీకి కెఫుషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను నూటికి నూరు శాతం తడి చెత్త, పొడి చెత్తలను సేకరించాలన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చందనపల్లి లో ఉన్న డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.
డంపింగ్ యార్డ్ వల్ల తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, డంపింగ్ యార్డ్ లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు వర్మి కంపోస్టు తయారుపై దృష్టి సారించాలని చెప్పారు. డంపింగ్ యార్డ్ ద్వారా చెత్త రీసైక్లింగ్, డిస్పోస్ చేయడంపై సూచనలు చేశారు. డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న స్థలంలో స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.
స్లాటర్ హౌస్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని మున్సిపల్ అధికారులకు ఆమె తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ శేషమ్మ గూడలో ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సైతం తనిఖీ చేశారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, తహసిల్దార్ శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.
MOST READ :
-
Allu Arjun : హీరో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు..!
-
District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. ఎగుమతులకు అవసరమైన ఉత్పత్తులు చేస్తే ప్రోత్సాహం..!
-
Gold Price : పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్..!
-
Holidays : విద్యార్థులకు ఎగిరిగుంతసే న్యూస్.. వరుసగా సెలవులు, ఎప్పుడంటే..!









