Miryalaguda : తొవ్వుకున్నోళ్లకు తోవుకున్నంత.. జోరుగా అక్రమ దందా..!
Miryalaguda : తొవ్వుకున్నోళ్లకు తోవుకున్నంత.. జోరుగా అక్రమ దందా..!
మాడుగులపల్లి, మన సాక్షి :
ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలలో మట్టిని తరలించాలన్నా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. కానీ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడుగులపల్లి మండలంలో మాత్రం దేనికి అనుమతి అనుమతి అవసరం లేదా అన్నట్లుగా ఉంది. ఆదివారం అధికారులకు సెలవు ఉండడంతో అధికారుల కన్నుగప్పి దళారులు జోరుగా మట్టి దందా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. సీత్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని పుచ్చకాయల గూడెం నుంచి రెండు రోజులుగా మట్టి అక్రమ రవాణా కొనసాగుతుంది.
“తవ్వుకున్నోళ్లకు… తవ్వుకున్నంత” అన్నట్లుగా ఈ దంద కొనసాగుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక జెసిబి మూడు టిప్పర్లు సహాయంతో మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. కొంతమంది దళారులు పగలు రాత్రి అని తేడా లేకుండా మొరం తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు.
ఒక్కొక్క టిప్పర్ కు రూ.3000 నుంచి రూ.5000 వరకు తీసుకొని లక్షలు సంపాదిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలు :
మట్టి తవ్వకాలు జరపాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మట్టిని తరలించాలంటే ప్రభుత్వానికి సీనేజ్ కట్టి మట్టి తవ్వకాలు జరిపితే ఒక క్రమ పద్ధతిలో జరపాలి. కానీ మండలంలో మట్టి దళారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా తవ్వకాలు జరుపుతున్నారు.
దీంతో రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడుతున్నాయనీ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ మట్టి రవాణాని అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
MOST READ :









