Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవైద్యంహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు రెడీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదలకు రేషన్ కార్డులు రెడీ అయ్యాయి. పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల అనేకమంది నిరుపేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల రేషన్ కార్డులకు బదులు వాటి స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకుగాను ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామం, మున్సిపాలిటీలో ఒక వార్డును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే పూర్తి చేశారు. కాగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించనున్నారు.

కొత్త కార్డుల కోసం దరఖాస్తులు :

కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాలలో 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో పది లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

ఈసారి రేషన్ కార్డులకు బదులు స్మార్ట్ కార్డులను అందజేస్తామని, వాటికి మైక్రో చిప్ అమర్చి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్డుల జారీకి 956 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో 81 లక్షల 95 వేల రేషన్ కార్డులు ఉన్నాయని, వాటి ద్వారా 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ అందుకుంటున్నారని ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని, రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు