Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా పై సీలింగ్.. వారికి మాత్రమే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు భరోసా పై సీలింగ్ పెట్టబోతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శాసనసభ సమావేశాల్లో చర్చించి ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు ద్వారా అనేక అవకతవకలు అక్రమాలు జరిగాయి. సాగుకు యోగ్యం కానీ భూములకు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలకు కూడా రైతుబంధును వర్తింపజేశారు. దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ సూచనలను శాసనసభకు అందజేసింది. సబ్ కమిటీ సూచనల మేరకు రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేయనున్నారు.

అయితే ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులే ఉన్నందున రైతు భరోసా పథకాన్ని 5 లేదా 7. 20 లేదా 10 ఎకరాల లోపు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ సూచించింది. దీనిలో ఏదో ఒకటి ఫైనల్ చేయనున్నారు. అదే విధంగా ఉద్యోగస్తులకు, ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా స్థాయి అధికారులకు సైతం వ్యవసాయ భూములు ఉండడంతో వారికి కూడా గతంలో రైతు బంధు వర్తింపజేశారు.

కాగా రైతు భరోసాను వారికి కట్ చేయనున్నారు. ఇంకా ఇన్కమ్ టాక్స్ చెల్లించే వారికి రైతు భరోసా రాబోదు. కేవలం పంటలు సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

అందుకు గాను ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రైతు భరోసా పై కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి రైతుల ఖాతాలలో ఒక విడత ఎకరానికి 7500 చొప్పున జామ చేయనున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు