Breaking Newsతెలంగాణవైద్యంసినిమాహైదరాబాద్

Hyderabad : ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్..!

Hyderabad : ఫిలిం సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్..!

శంకర్‌పల్లి (మన సాక్షి):

ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా శాలిని జాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ సమాచార శాఖ రాష్ట్ర రీజినల్ అధికారి షిఫాలీ కుమార్ ఆమెకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉంటారు.

ఈ సందర్భంగా శాలిని జాదవ్ మాట్లాడుతూ మహిళల కోసం చేసిన సేవలను గుర్తించి ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు.

ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా జనహితం కోరే సినిమాలు రూపొందే విధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. తాను మహిళల కొరకు చేస్తున్న సేవలకు తన భర్త ఎంతో సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు