Breaking Newsతెలంగాణరాజకీయంవైద్యంహైదరాబాద్
KTR : కేటీఆర్ పై మరో కేసు.. మనీ లాండరింగ్ కింద ఈడి కేసు నమోదు..!
KTR : కేటీఆర్ పై మరో కేసు.. మనీ లాండరింగ్ కింద ఈడి కేసు నమోదు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో భారీ షాక్ తగిలింది. కేటీఆర్ పై మరో కేసు నమోదు అయింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ డి కేసు నమోదు చేసింది. ఫేమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద ఈ కేసులు నమోదయ్యాయి. ఏ 1 గా కేటీఆర్, ఎ2గా అరవింద్, ఎ3 గా బిఎల్ఎన్ రెడ్డి ని పేర్కొంటూ ఈడి కేసు నమోదు చేసింది.
ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో హైకోర్టు పది రోజులపాటు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాస్త ఊరట చెందిన కేటీఆర్ కు వెంటనే మరో భారీ షాక్ తగిలింది. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్) కేసు నమోదు చేసింది.
MOST READ :









