Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BIG BREAKING : డీసీఎం బీభత్సం.. పెద్ద దర్గా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

BIG BREAKING : డీసీఎం బీభత్సం.. పెద్ద దర్గా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో హజ్రత్ హాజీ హఫెజ్ మహమ్మద్ దుర్వేష్ ఖాద్రి ఖాదర్ షావలి దర్గా (పెద్ద దర్గా) సమీపంలో శనివారం ఉదయం 6:30 గంటల సమయంలో డీసీఎం బీభత్సం సృష్టించింది… స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హజ్రత్ హాజీ హఫెజ్ మహమ్మద్ దుర్వేష్ ఖాద్రి ఖాదర్ షావలి దర్గా ఉర్సు ఉత్సవాలు ఉండడం వలన దర్గా మూతవల్లిలు తెలిపిన ప్రకారం…

పూర్వీకుల కాలం నుండి ఎర్రారం గ్రామనికి చెందిన వాళ్ళే గంధం ఊరేగింపు ఉర్సు ఉత్సవాలు చేస్తారు అని తెలిపారు. ఎర్రారం నుండి భక్తులు గ్రామస్తులు దేవరకొండ పట్టణంలో ఉన్న హజ్రత్ హాజీ హఫెజ్ మహమ్మద్ దుర్వేష్ ఖాద్రి ఖాదర్ షావలి దర్గా వద్దకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది అని తెలిపారు.

ఉర్సు ఉత్సవాలు ముగించుకొని ఇంటికి బయలుదేరే సమయంలో మల్లేపల్లి నుంచి దేవరకొండ వస్తున్న డీసీఎం పెద్ద దర్గా వద్దా జనాలలో దూసుకో వెళ్ళిపోయింది. ముగ్గురు మరణించడం జరిగింది. ఒకరి గాయాలతో కొట్టుమిట్టు ఆడుతున్నారు.

మృతులు షేక్ హాజీ మియా తటికోల్ (55) నభినా ఎర్రారం (23) అబ్దుల్ ఖాదర్ మేడిపూర్ (18) దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు