Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

ఖైరతాబాద్ ఉప ఎన్నిక బ్రేక్..? హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి..!

ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పి జె ఆర్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నేత విజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నిక బ్రేక్..? హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఖైరతాబాద్ ఉప ఎన్నిక విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని కోరుతూ పి జె ఆర్ కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నేత విజయ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు రాక.. బిగ్ ట్విస్ట్ ఏంటంటే..!

ఆమె 2024లో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు వచ్చేవరకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే ప్రక్రియను నిలిపివేయాలని పిటిషన్ లో కోరారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్లో ఎన్నికల సంఘం, దానం నాగేందర్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

అసలు విషయం ఏంటంటే..?

2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో విజయారెడ్డి పై దానం నాగేందర్ 22010 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఆ తర్వాత దానం నాగేందర్ బి ఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ఎన్నికల అఫిడవిట్ లో దానం నాగేందర్ తన భార్య ఆధారపడిన, వారి ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచి పెట్టారని ఆరోపిస్తూ విజయ రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించి ఆయన ఎన్నిక రద్దు చేయాలని ఆమె పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ కోర్టులో పెండింగ్ లో ఉంది.

Also Read : ఖైరతాబాద్ ఉప ఎన్నిక బ్రేక్..? హైకోర్టును ఆశ్రయించిన విజయారెడ్డి..!

కాగా పార్టీ ఫిరాయింపుల విషయంపై దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి పై హైకోర్టు వేటు వేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తిరుపతయ్య ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని పేర్కొంటూ శనివారం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. త్వరలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ క్రమంలో విజయ రెడ్డి తన పాత పిటిషన్ పై మరోసారి కోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె పిటిషన్ పై హైకోర్టు విచారణ లో ఎలాంటి నిర్ణయం ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు