Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు
వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం..!
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట గ్రామ శివారులో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.

వ్యవసాయ బావిలో మహిళ మృతదేహం..!
మన సాక్షి, జగిత్యాల :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మోహన్ రావు పేట గ్రామ శివారులో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామ శివారులోని శ్రీరామ ఫంక్షన్ హాల్ వెనక ఉన్న వ్యవసాయ బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. మహిళ మృతి కి గల కారణాలు ఆమెకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.









