Hyderabad : మద్యం మత్తులో వాహనం డ్రైవింగ్.. ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు..!
Hyderabad : మద్యం మత్తులో వాహనం డ్రైవింగ్.. ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
ఓ మహిళ మరణానికి కారణమైన వ్యక్తికి శనివారం రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, పది వేల జరిమాన విధించింది. సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం 2021లో చేవెళ్ల మండల కందవాడ గ్రామ వాసులు ఫిరంగి లక్ష్మి రవి భార్యాభర్తలు శంకర్‌పల్లి ఆస్పత్రికి వచ్చారు.
ఇంటికి తిరుగు ప్రయాణంలో రామంతపూర్ క్రాస్ రోడ్ వద్ద నవాబుపేట మండలం మాదారం గ్రామానికి చెందిన కావలి అనిల్ కుమార్ (24) మద్యం మత్తులో వాహనం నడిపి ఎదురుగా భార్యా భర్తలు వస్తున్న బైక్ ను ఢీకొట్టగా లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందింది.
కేసు దర్యాప్తులో భాగంగా తొమ్మిదవ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి హరీష నిందితుడికి కఠిన కారాగార శిక్ష విధించింది. విచారణ జరిపి దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని సిఐ అభినందించి రివార్డు ప్రకటించారు. ఎవరైనా మద్యం సేవించి మద్యం మత్తులో వాహనాలు నడిపితే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
MOST READ :
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!
-
Nalgonda : కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజాశాంతి పార్టీలో చేరాలి.. కేఏ పాల్ సంచలన ప్రకటన..!
-
District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!
-
Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!









