Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా పై మంత్రి తుమ్మల క్లారిటీ.. ఒక్క రైతును కూడా తగ్గించం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయింది. వానకాలం సీజన్ లో ప్రారంభించాల్సిన రైతు భరోసా పథకం కాస్త ఆలస్యమైంది. కాగా రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15 వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా వ్యవసాయ సాగు యోగ్యం కాని భూములకు కూడా ప్రభుత్వం సహాయం అందించింది. దాంతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. కాగా రైతు భరోసా పథకంలో అనేక మార్పులు చేయనున్నట్లు వచ్చిన ప్రచారంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు.
సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఆయన మరోసారి స్పష్టం చేశారు. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఆధారంగా విధివిధానాలను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. రైతు భరోసా పథకం పై విధివిధానాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అందరి సూచనలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
అయితే ఏ ఒక్క రైతును కూడా తగ్గించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించడం వల్ల రైతులు ఆనందంలో ఉన్నారు. సాగుకు యోగ్యం కానీ రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు ఉన్న భూములను మాత్రమే తొలగిస్తారా..? పెద్ద రైతులను కూడా ఈ పథకం నుంచి తొలగిస్తారా.? అనే విషయం తెలియాల్సి ఉంది.
MOST READ :
-
TG News : రైతులకు అదిరిపోయే శుభవార్త.. మరో కొత్త పథకం ప్రారంభం..!
-
District collector : స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లా కలెక్టర్..!
-
Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!
-
District collector : జిల్లా కలెక్టర్ మానవత్వం.. పల్లీలు అమ్మే వికలాంగ మహిళకు..!









