జాతీయంBreaking Newsరాజకీయం
మాజీ ప్రధాని మన్మోహన్ ఇక లేరు..!
మాజీ ప్రధాని మన్మోహన్ ఇక లేరు..!
మన సాక్షి, న్యూఢిల్లీ :
మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల కర్త మన్మోహన్ సింగ్ (92) ఇకలేరు. గురువారం రాత్రి ఆయన వయో సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. దాంతో గురువారం ఆయన నివాసంలో అస్వస్థతకు గురికాగా ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అయితే గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. మచ్చలేని రాజనీతిజ్ఞుడుగా ఆయన కొనసాగారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
MOST READ :
-
PM Kisan : PMKYతో రైతుల ఖాతాలలో రూ.6వేలు.. లబ్దిదారుల చెకింగ్.. కొత్ర ధరఖాస్తు ఇలా.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!
-
PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బుల కోసం.. డిసెంబర్ 31 లోగా రైతులు రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు సీలింగ్.. మీరు అర్హులేనా, లేటెస్ట్ అప్డేట్..!









