Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

Miryalaguda : మన సాక్షి పత్రికకు పెరిగిన ఆదరణ.. ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మన సాక్షి తెలుగు దినపత్రిక కు తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మన సాక్షి పత్రికలో వాస్తవాలు రాస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విషయంలో మన సాక్షి పత్రిక ముందుందన్నారు.

రాబోయే రోజుల్లో మన సాక్షి పత్రిక పాఠకులు మరింతగా పెరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, పత్రిక ఎడిటర్ మల్లె నాగిరెడ్డి, పత్రిక విలేకరులు బొంగర్ల సైదులు, చారి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు