TOP STORIESBreaking Newsహైదరాబాద్

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కొత్త రేషన్ కార్డులు కావలసినవారు గ్రామసభలలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల జనవరి 21వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నారు. గ్రామసభలలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం ఎప్పటినుంచో సిద్ధమైన విషయం తెలిసిందే. కాగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోకుండానే సమగ్ర కుల గణన ఆధారంగా అధికారులు సర్వే నిర్వహించారు. సర్వేలో రేషన్ కార్డుల ప్రస్తావన లేకపోవడంతో అనేకమంది రేషన్ కార్డుల కోసం వివరాలు వెల్లడించలేదు. దాంతో చాలామందికి రేషన్ కార్డులు రావని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ సిఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త రేషన్ కార్డులకు మరోసారి దరఖాస్తులు గ్రామసభలలో తీసుకోవాలని సూచించింది. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు కూడా దరఖాస్తులు తీసుకోవాలని సూచించింది. అంతే కాకుండా ఒక కుటుంబం నుంచి వేరుపడుతున్న మరో కుటుంబం కూడా రేషన్ కార్డుకు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టంగా తెలియజేసింది. రేషన్ కార్డు దరఖాస్తుకు కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు, కులం, మొబైల్ నెంబర్, చిరునామా తీసుకోవాలని గైడ్లైన్స్ విడుదల చేసింది.

MOST READ : 

  1. District collector : గ్రామసభలో సమయపాలన పాటించాలి.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. Miryalaguda : సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించాలి.. ఎమ్మెల్యే ఆదేశం..!

  3. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

  4. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  5. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు