Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి..!

Nalgonda : నల్గొండ బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి..!

మన సాక్షి, నల్గొండ :

నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి లభించింది. ఈనెల 28వ తేదీన బీఆర్ఎస్ మహా రైతుధర్నా నిర్వహించనున్నారు. 28వ తేదీన క్లాక్ టవర్ సెంటర్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రైతు ధర్నా నిర్వహించనున్నారు. రైతు ధర్నాకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహా ధర్నా ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. మొదటగా జనవరి 12వ తేదీన మహాధర్నా నిర్వహించాలని తలపెట్టినప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని ఉద్దేశంతో ధర్నాలో వాయిదా వేసింది.

అదేవిధంగా ఈనెల 22వ తేదీన మహా ధర్నా నిర్వహించాలని తలపెట్టినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. కాగా హైకోర్టు 28వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకునే అనుమతిని ఇచ్చింది.

MOST READ : 

మరిన్ని వార్తలు