Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

మరోసారి ధరఖాస్తులు చేసేందుకు గ్రామ సభలకు.. ఆర్డీఓ..!

మరోసారి ధరఖాస్తులు చేసేందుకు గ్రామ సభలకు.. ఆర్డీఓ..!

పెన్ పహాడ్, మనసాక్షి:

సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డిఓ ఆర్ వేణుమాధవరావు అన్నారు. మేగ్య తండా గ్రామపంచాయతీలో గ్రామసభకు హాజరై ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని 8 గ్రామాల పంచాయతీలలో బుధవారం జరిగిన గ్రామ సభలకు ప్రజలు నుండి స్పందన లభించిందని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోయే 4 సంక్షేమ పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారని జాబితాలో అనేక మందికి పేర్లు కనిపించకపోవడంతో మరోసారి దరఖాస్తులు చేసేందుకు ప్రజలు గ్రామ సభలలో దరఖాస్తు చేసుకునేందుకు పేదలు భారీగా తరలివస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డులకు మరోసారి గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించడంతో గ్రామ సభలలో రేషన్ కార్డుల కొరకు ఇందిరమ్మ గృహాల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులు దరఖాస్తులు అందజేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ధారావతు లాలు నాయక్, ఎంపీడీవో జంజనాల వెంకటేశ్వరరావు, ఏవో అనిల్ కుమార్, ఎం పి ఓ సంజీవయ్య, ఏపిఎం అజయ్ నాయక్, డాక్టర్ వెంకన్న, పి రాంబాబు, రంజిత్ రెడ్డి, ఉన్నిసా, ఏక స్వామి, ఏ ఈ ఓ లు సంధ్య , త్రివేణి, మురళి, రాకేష్,

శ్రావణి, పంచాయితీ కార్యదర్శులు రాకేష్, శ్రీనివాస్, షేక్ మున్నీర్, బచ్చలకూరి సతీష్, వెంకటలక్ష్మి, పల్లి సంజయ్ కుమార్, సాయి ని లావణ్య, విజయ్ కుమార్, షేక్ అఖిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ ఐ కస్తాల గోపికృష్ణ గట్టినిగా ఏర్పాటు చేసినారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు