Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!

Additional collector : అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.. అదనపు కలెక్టర్..!

సూర్యాపేట, మనసాక్షి :

అర్హులైన నిరుపేదలు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసే క్రమంలో జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

అధికారులు చదివిన జాబితాలో పేర్లు లేని వారు మరల దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఒక్క రోజుతో ఆగదని నిరంతరం కొనసాగుతుందని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

వార్డులో నిజమైన అర్హులను గుర్తించే అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. జాబితాలో పేర్లు లేని వారు మరల దరఖాస్తులు చేసుకుంటే అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు జావీద్,వార్డు అభివృద్ధి అధికారిని కవిత,జ్యోతుల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!
  2. Miryalaguda : రేషన్ కార్డు కోసం ప్రభుత్వ ఉద్యోగుల ధరఖాస్తు.. డబుల్ దరఖాస్తులతో అధికారులకు తలనొప్పి..!
  3. Ration Cards : కొత్త రేషన్ కార్డులకు మరో అవకాశం.. ఇవి తప్పనిసరి ఉండాలి.. లేటెస్ట్ అప్డేట్..!
  4. SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు