Breaking Newsతెలంగాణసంక్షేమంహైదరాబాద్

TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!

TG News : నాలుగు పథకాలకు ముహూర్తం ఖరారు.. మండలానికి ఒక గ్రామం ఎంపిక..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోయే నాలుగు సంక్షేమ పథకాలకు ముహూర్తం ఖరారైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రారంభించనున్నది. ప్రారంభించబోయే పథకాలలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.

26వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ పథకాలను ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు. మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి మధ్యాహ్నం ఒంటిగంటకు నాలుగు పథకాలను ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 6 కేజీల నాణ్యమైన సన్న బియ్యం అందించబోతున్నట్లు ఉత్తంకుమార్ రెడ్డి పేర్కొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా.. ఉద్యోగులకు డిఏ.. ముహూర్తం ఫిక్స్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : గ్రామ సభల్లో చదివే జాబితా.. తుది జాబితా కాదు..!

  4. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

మరిన్ని వార్తలు