Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

BIG BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు..!

BIG BREAKING : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ పై చింతపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పెళ్లి బస్సు ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొన్నది.

ట్రాక్టర్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని మిర్యాలగూడలోని వర్షిత హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో 36 మంది ఉన్నారు.

ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్..!

  2. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!

  3. SLBC : ఎస్ఎల్బీసీ సారంగ ప్రమాదంలో.. 8 మంది గల్లంతు..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఎప్పుడు ఇస్తారో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఇదే మంచి ఛాన్స్.. ఈరోజు ధర..!

మరిన్ని వార్తలు