KCR : కేసీఆర్ ఇంటర్నెట్ – జిరాక్స్ సెంటర్ ప్రారంభం..!
KCR : కేసీఆర్ ఇంటర్నెట్ – జిరాక్స్ సెంటర్ ప్రారంభం..!
దంతాలపల్లి, మన సాక్షి:
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, పార్టీ అధినేత కేసీఆర్ అభిమానులకు ఎప్పుడూ అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమకారుడు బిఆర్ఎస్ కార్యకర్తకు చేయూతను అందించి మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామానికి చెందిన చిర్ర సతీష్ కుటుంబం 2001 లో పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ కార్యకర్త, సతీష్ కూడా కేసిఆర్ వీరాభిమాని.
చిన్ననాటి నుంచి వినికిడి సమస్య ఉన్న సతీష్ డిగ్రీ పూర్తి చేశారు. అయితే, స్వయం ఉపాధి కోసం జిరాక్స్ మిషన్, ల్యాప్ టాప్ ఇప్పిస్తే స్వయం ఉపాధి పొందుతానని, ఇటీవల కేసిఆర్ జన్మదినం రోజున ఎమ్మెల్సీ కవితకు సతీష్ మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన స్వయం ఉపాధికి కావలసినవి నిధులను సమకూర్చారు. జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి సహకారం అందించడమే కాకుండా, దాన్ని సోమవారం రామానుజపురం గ్రామానికి విచ్చేసి స్వయంగా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిన ఉద్యమకారుల రుణం తీరదని, రాష్ట్ర ప్రజల అభ్యున్నతే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, ప్రజల అభ్యున్నతికి పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, కార్యకర్తలే పార్టీకి ఆవు పట్టని కార్యకర్తలకు అండగా ఉంటామని, కార్యకర్తలకు, ఉద్యమకారుల కుటుంబాలకు కేసిఆర్, బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో మన ప్రభుత్వం లేకపోయిన ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బిఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. 2001 నుండి తెలంగాణ కోసం జెండా పట్టి కేసిఆర్ దిశా నిర్దేశంలో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యమకారుడికి రుణపడి ఉంటామన్నారు. మన నీళ్లు , నిధులు , నియామకాలపై ఏర్పడిన తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వంలో పెద ప్రజలకూ న్యాయం జరిగిందని , కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు శూన్యం అన్నారు.
కాంగ్రెస్ అంటేనే దగా మోసం అన్నారు. ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీకి,తెలంగాణకు మీరే బలం, మీరే బలగమని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ లోని మానుకోట జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు, ఇక్కడి ప్రజలు చైతన్యానికి ప్రతికగా నిలిచారన్నారు. నియోజక వర్గంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన రెడ్యానాయక్ కు డోర్నకల్ నియోజకవర్గంలో కిసిఆర్ సారధ్యంలో కాలేశ్వరం నీటితో డోర్నకల్ ను సస్యశ్యామలం చేశారని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, ఐక్యంగా ఉండి కేసిఆర్ నాయకత్వంలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీ, విప్ సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి డిఎస్ రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ బిందు, నూకల వెంకటేశ్వర్ రెడ్డి, ఒలాద్రి ఉమా మల్లారెడ్డి, ధర్మారపు వేణు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు చిల్ల రామకృష్ణ,తండా పెద్ద రాములు, కృష్ణారెడ్డి, ధర్మారపు వెంకన్న, కిషన్ నాయక్, నాగిరెడ్డి శైలజ వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, చిల్ల లక్ష్మీనర్సు, చంద్రమౌళి, చిరగాని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.









