Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఇందిరమ్మ ఇంటి కోసం పేదలు రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందో..? లేదో..? అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అందుకు వారికోసం ప్రభుత్వం ఒక వెబ్సైట్ ను ప్రారంభించింది. ఆ వెబ్సైట్ లో ఇల్లు మంజూరు అయిందా..? లేదా..? అనే విషయం తెలుసుకోవచ్చును. మీకు సెల్ఫోన్ ఉంటే ఫోన్ లోనే తెలుసుకునే వీలు కల్పించింది.

ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఇందిరమ్మ ఇంటికి చేసుకున్న దరఖాస్తు ఏ జాబితాలో ఉందో అనే విషయం తెలుసుకోవచ్చును

https://indirammaindlu.telangana.gov.in/applicantSearch

వెబ్సైట్ క్లిక్ చేసి ఫోన్ నెంబర్/ ఆధార్ నెంబర్/ రేషన్ కార్డు నెంబర్/ అప్లికేషన్ నెంబర్ ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఆ నెంబర్ టైప్ చేసి Go అని క్లిక్ చేస్తే మీ ఇందిరమ్మ ఇల్లు స్టేటస్ తెలుస్తోంది.

మొత్తంగా సర్వే ఆధారంగా L1 మొత్తం 21.93 లక్షల దరఖాస్తులు, L2 19.96 లక్షల దరఖాస్తులు, L3 33. 87 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2.43 లక్షల ఇళ్లను ఇంకా పరిశీలించాల్సి ఉంది. దరఖాస్తులను మూడు జాబితాలుగా తయారు చేశారు.

వాటిలో L1, L2, L3 పేరుతో దరఖాస్తులను విభజించారు.

  • L1 ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. అదేవిధంగా ఖాళీ స్థలంతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల ఇండ్లు ఉన్న వారిని కూడా ఈ జాబితాలోనే చేర్చారు.

  • L2 సొంత స్థలం లేని వారిని ఈ జాబితాలో చేర్చారు. వీరంతా ఖాళీ స్థలంతో పాటు ఎలాంటి ఇండ్లు లేని వారు.

  • L3 సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని ఈ జాబితాలో చేర్చారు.

MOST READ :

  1. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  4. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  5. Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!

 

మరిన్ని వార్తలు