Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎంతో మంది పేదలు ఎదురుచూస్తున్నారు. వారికి రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనతో పాటు గ్రామ సభలలో కూడా దరఖాస్తులు స్వీకరించారు. కాగా కొత్త రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది.
ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలలో ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ దరఖాస్తుల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున అందించలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 80 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మార్చి 30వ తేదీ తెలుగు సంవత్సరాది ఉగాది రోజున కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అప్పటిలోగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చినవన్నీ పరిశీలించడంతో పాటు పాత కార్డుల స్థానంలో కూడా కొత్త వాటిని సిద్ధం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!









