Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలురాజకీయం

Khammam : మెడికల్ మాఫియా.. ఆగడాలు అరికట్టాలని డిమాండ్..!

Khammam : మెడికల్ మాఫియా.. ఆగడాలు అరికట్టాలని డిమాండ్..!

ఖమ్మం బ్యూరో, మన సాక్షి:

ఖమ్మంలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టాలి అని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కె.వి.కృష్ణా రావు మాట్లాడుతూ నగరంలో అక్రమ అబార్షన్స్ దారుణంగా జరుగుతున్నాయి. కడుపులోనే శిశు బాలికలను హత్య చేస్తున్నారని, ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిపై అన్ని రకాల ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా ఉద్యమించి అక్రమ అబార్షన్స్ ను అరికట్టడానికి కృషి చేయాలని అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు పేద ప్రజలు వివిధ రకాల ఆరోగ్య సమస్యల మీద వస్తే ఆసుపత్రి యాజమాన్యాలు అవసరం లేకపోయినా అడ్డగోలుగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఉన్న రేట్లకు పది రేట్లు అదనంగా బిల్లు వసూలు చేయడం, అమాయక రోగుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్య వృత్తితో సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు కొన్ని మేనేజ్మెంట్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి అమాయక రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

మల్టీ స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీల పేర్లతో కొన్ని ప్రవేట్ ఆసుపత్రులు లక్షలలో బిల్లులు వసూలు చేస్తున్నారు. కావున ఇటువంటి వారిపై తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మెడికల్ మాఫియా కు పాల్పడుతున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇంచార్జ్ అయితగాని శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు కొట్టే సుధాకర్ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు ఉపేంద్రబాయి,ఆప్ పార్టీ జిల్లా అధ్యక్షులు స్వర్ణ సుబ్బారావు, పీపుల్స్ జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Power Cut : విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

  2. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : LRS ఫీజులు 25% రాయితీ.. సద్వినియోగం చేసుకోండి.. జిల్లా కలెక్టర్..!

  4. Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్.. ఉత్తర్వులు జారీ..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

మరిన్ని వార్తలు