Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Miryalaguda : టోల్గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో..!

Miryalaguda : టోల్గేట్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో ఉన్న మూసీ నదిపై ఉన్న టోల్గేట్ వద్ద సూర్యాపేట జిల్లా వాసులు భారీగా రాస్తారోకో నిర్వహించారు. నిబంధనల ప్రకారం 20 కిలోమీటర్ల మేరకు ఉచితంగా వాహనాలకు పాస్ లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి టోల్గేట్ వద్ద అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం కాకముందే టోల్గేట్ వసూలు చేపడుతున్నారని, అంతేకాకుండా నిబంధనల మేరకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని రకాల వాహనాలకు ఉచితంగా పాసులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టోల్గేట్ యాజమాన్యం వారిస్తుందని అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఉచిత పాసులు అందజేయాలని వారి డిమాండ్ చేశారు.

టోల్ ఎత్తివేయాలి :

ఆలగడప టోలగేట్ లొ 20కి. మీ. పరిధి లో టోల్ ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి చొరవ చూపి ఈ సమస్యను పరిక్షరించాలన్నారు. టోలగేట్ వాళ్ళు అక్రమ వసుళ్లకు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రాంతపు ప్రజా ప్రతినిధులకు వుంది. దాదాపుగా నెల రోజులుగా ఈ తతంగo జరుగుతున్నా నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదు.

20 కి. మీ పరిధి లో ని వాహన యజమానులు స్పందించాల్సిందిగా ప్రజాప్రతినిధుల మీద వత్తిడి తేవాల్సిందిగా మనవి.. ఈ సమావేశం లో పాల్గొన్న వాళ్ళు వేనేపల్లి పాండురంగా రావు, జనార్దనరావు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ తదితరులు ఉన్నారు

MOST READ : 

  1. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

  2. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

  4. Miryalaguda : విధేయతకు వరించిన ఏంఎల్సీ..!

  5. Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్‌..!

మరిన్ని వార్తలు