Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ముగ్గురు దొంగలు.. రెండు బృందాలు..!

Nalgonda : ముగ్గురు దొంగలు.. రెండు బృందాలు..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో మీనాక్షి ప్లాజాలో గత నెల 19న శీలా వాసు ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏఎస్పీ మౌనిక బుధవారం వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, టోలిచౌక్ కు చెందిన ఎస్.కె అబ్దుల్ జాఫర్, ఎండి మోసిన్, ఓల్డ్ సిటీకి చెందిన ఎస్.కె మహమ్మద్ రఫీ ల వద్ద 13.5 తులాల బంగారాన్ని రికవరీ చేసినట్లు చెప్పారు.

దేవరకొండ ఏఎస్పీ మౌనిక, స్టేషన్ ఎస్ హెచ్ ఓ నర్సింహులు మాట్లాడుతూ… మొదటి నిండుతుడు షేక్ మొహమ్మద్ జాఫర్ మీద సుమారు 70 పైచిలుక దొంగతనాలు కేసులు హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లో నమోదు అయి ఉన్నవి అని తెలిపారు.

దొంగతనాల కేసులలో జాఫర్ చాలాసార్లు చంచల్గూడా, చర్లపల్లికి జైలుకు వెళ్లినట్టు తెలిపారు. నిందితుడు జాఫర్ 2021లో దొంగతనం చేసి చివరిగా గోల్కొండ పిఎస్ లో రిమాండ్ అయి జేలుకు వెళ్లి రావడం జరిగింది అన్నారు. నిందితుడు జాఫర్ కొన్ని సంవత్సరాలు దొంగతనాలు ఆపడం జరిగింది అన్నారు.

2025 లో మరో ఇద్దరు సహనిండుతులు చేర్చుకొని మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టడం జరిగింది అని అన్నారు. జాఫర్ సహనిండుతుడు మోసిన్ సన్నాఫ్ మునీర్ ని కలుపుకొని దొంగతనాలు గురించి చెప్పగా అతను సులభంగా డబ్బులకు వస్తాయని దురాశతో జాఫర్ తో కలిసి ఆంధ్ర మరియు తెలంగాణలో దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు అని అన్నారు.

జనవరి నెలలో అల వారిద్దరూ ఒక యాక్టివా స్కూటీపై కర్నూలు, ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంకి, వేళ్లి దొంగతనాలకు పాల్పడ్డారు అని తెలిపారు. దేవరకొండకు వచ్చి అపార్ట్మెంట్లో వెళ్లి ఒక రాడ్డు సహాయముతో తాళాలు పలగొట్టి ఇండ్లలో జొరబడి దొంగతనాలు చేసి సుమారు 30 తులాల వరకు బంగారం ఆభరణాలను దోచుకుని వెళ్లారు అని తెలిపారు.

మళ్లీ తిరిగి దేవరకొండలో దొంగతనం చేయుటకు ఇద్దరు నిందితులు రాగా పోలీసులు వారిని పట్టుకుని, వారి వద్ద ఉన్న రాడ్డు సీజ్ చేయడం జరిగింది అని అన్నారు. మరో నిందితుడు పసి వద్ద బంగారు నగలను కరిగించి ముద్దచేసి ఉంచారు అని అన్నారు. బంగారం మొత్తం తీసుకుని దేవరకొండ పోలీసు వారు సీజ్ చేయడం జరిగింది అన్నారు.

రెండు బృందాలుగా ఏర్పడి కేసు చేదించిన పోలీసు సిబ్బంది వివరాలు

యం. నర్సింహులు దేవరకొండ స్టేషన్ ఎస్ హెచ్ ఓ, ఎస్సై నారాయణరెడ్డి, ఎస్సై అజ్మీర రమేష్, ఎస్సై రూవ్వ కోటేష్, మల్లెపల్లి కానిస్టేబుల్ హేమ నాయక్, దేవరకొండ కానిస్టేబుల్ పోలే తిరుపతి, కానిస్టేబుల్ ఎస్కే చాంద్ పాషా, రైటర్ రాజారామ్, ఎస్ కే ఇమ్రాన, కే సతీష్, బూర అంజి, యాదయ్య, సోమ్లా, హోంగార్డ్ సింహాద్రి…నిందితులను పట్టుకోవడానికి అత్యంత ప్రతిభ కనపరిచి చేధించిన పోలీసు అధికారులకు తగిన శాఖపరమైన రివార్డులు దేవరకొండ ఏఎస్పి మౌనిక అందించడం జరిగింది.

MOST READ :

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  2. Hyderabad : కుటుంబం ఆత్మహత్యలో సంచలన విషయాలు.. వెల్ సెటిల్ కుటుంబం.. గ్రామస్తులు బయటపెట్టిన వాస్తవాలు..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. మంజూరైనా వారికి రద్దు లేటెస్ట్ అప్డేట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !

  5. Suspended : డీఈవో సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్‌..!

మరిన్ని వార్తలు