సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పోచారం.. హాట్ టాపిక్.. | CM REVANTH REDDY MEETS POCHARAM
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పోచారం.. హాట్ టాపిక్.. | CM REVANTH REDDY MEETS POCHARAM
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన బాన్సువాడ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అతనిపై పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ కు ఫిర్యాదు తో పాటు కోర్టులో కేసులు కూడా బిఆర్ఎస్ నేతలు వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నానని నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాలని హాట్ కామెంట్స్ చేశారు.
అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని చర్చ కొనసాగింది. అదే సమయంలో బిఆర్ఎస్ లోకి వచ్చినా అతడిని పార్టీలో చేర్చుకోవద్దంటూ కూడా చర్చ కొనసాగింది. కాగా మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయంగా చర్చనీ అంశమైంది.
కామారెడ్డి జిల్లాలో బిచ్కుంద లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు కుమార్తె వివాహా విందు కు హాజరయ్యేందుకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. తిరిగి వెళ్లే సమయంలో కూడా హెలిపాడ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక బస్సులు వెళ్లడం చర్చని అంశంగా మారింది.









