Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
టిజిపిఎస్సి గ్రూప్ – 3 పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో టాపర్ గా నల్లగొండ జిల్లాకు చెందిన వినిషారెడ్డి నిలిచారు. టిజిపిఎస్సి గ్రూప్ – 3 పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో టాపర్ గా నల్లగొండ జిల్లాకు చెందిన వినిషారెడ్డి నిలిచారు.ఆమె 450 మార్కులకు గాను 325.157 మార్కులతో 8వ ర్యాంకు సాధించారు. గ్రూప్ -3 ఫలితాల్లో మహిళా టాపర్ గా నిలిచిన వినీషారెడ్డి గ్రూప్ -2 ఫలితాల్లో కూడా ఆమె టాపర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం రేగులగడ్డ వాసి వినీషా రెడ్డి గ్రూప్ -2 మహిళా విభాగంలో 1 ర్యాంక్ సాధించింది. నిడమనూరు మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన లక్కిరెడ్డి (చామల) వినిషారెడ్డి మహిళల్లో మొదటి ర్యాంకు సాధించింది. రేగులగడ్డ గ్రామానికి చెందిన చామల ప్రభాకర్ రెడ్డి కుమారుడు దత్తు కుమార్ రెడ్డి (యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఇంజనీర్) భార్య లక్కిరెడ్డి వినీషా రెడ్డి.
గ్రూప్ 2 ఫలితాల్లో 408.7 మార్కులతో 32వ ర్యాంకు సాధించి మహిళల్లో మొదటి ర్యాంక్ లో నిలిచింది. వినీషా రెడ్డి గ్రూప్ – 2 గ్రూప్ -3 మహిళా విభాగంలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
-
TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!









