Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : జై బాపు, జై భీమ్ నినాదాలతో మారుమోగిన మిర్యాలగూడ..!

Miryalaguda : జై బాపు, జై భీమ్ నినాదాలతో మారుమోగిన మిర్యాలగూడ..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం జై బాపు, జై భీమ్ నినాదాలతో మారుమోగింది. గురువారం సాయంత్రం జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది.

అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపుమేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారి పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ లను బిజెపి అవమానిస్తుందన్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను అణిచివేసే విధంగా పాలన కొనసాగిస్తుందన్నారు. బిజెపి అరాచక పాలనను ప్రజలు ప్రజలకు తెలియజేస్తూ మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఖ్యాతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ జై బాపు, జై భీమ్ జై సంవిధాన్ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, నాయకులు చిలుకూరి బాలు, శేఖర్ రెడ్డి , జలంధర్ రెడ్డి, జానకి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. ఐతే వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై శుభవార్త.. ఈ పథకానికి మరిన్ని నిధులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

  4. Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు