Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు.. జిల్లా ఎస్పీ..!

Nalgonda : విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు.. జిల్లా ఎస్పీ..!

మాడుగులపల్లి, మన సాక్షి:

విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు,సత్వర ప్రజా సమస్యల పరిష్కారం పొందవచ్చని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం మండలంలోని ఆగమోత్కూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ పోలీసు అధికారులు ద్వారా జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కలుగుతుందన్నారు.

ప్రజలకు,పోలీసులకు మధ్య సత్సoబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందని,గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామాల్లో కి కొత్తగా వచ్చే అనుమానుమనితుల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలు విలేజ్ పోలీస్ అధికారికి అందించడం ద్వారా గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో ఏ యొక్క సమస్య ఉన్న విపిఓకి తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్యలు సత్వరమే తీర్చడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

గ్రామాల్లో సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని,గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా గాని మీసేజ్ ల ద్వారా మీ యొక్క సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో ఎవరికి సమాచారం అందించకూడదని సూచించారు.

అలాగే యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.ఎవరైనా గ్రామంలో గాంజా ఇతర మాదకద్రవ్యాలు క్రయ విక్రయాలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

పోలీస్ శాఖలో ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో గ్రామంలోని ముగ్గురికి ఉపాధి అవకాశం కలిగినందుకు అభినందనలు తెలిపారు.ఇలాగే యువత గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు,సిఐ పి.యం.డి ప్రసాద్,ఎస్ఐ కృష్ణయ్య,వీపీఓ సైది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LATEST : 

  1. ACB : రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తిమింగలం..! 

  2. Nalgonda : రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలతో హడల్.. కీలక ఆదేశాలు..!

  3. Miryalaguda : రైతుపై దాడి చేసిన రైస్ మిల్లర్లు.. ఆసుపత్రిలో రైతును పరామర్శించిన ఎమ్మెల్యే..!

  4. రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. కారులో ఆడుతుండగా డోర్ లాక్.. ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి..!

మరిన్ని వార్తలు