తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలి.. ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడ మున్సిపాలిటీలో రెండవ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో సేకరించిన సమస్యలను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు ప్రజల నుంచి వచ్చే సమస్యలను సేకరించి మరో సమావేశం ఏర్పాటు చేసి లోగా పరిష్కరించాలని ఆదేశించారు. డే బై డే 48 గంటలకు ఒకసారి రివ్యూ మీటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జవాన్లు, వార్డు ఇన్చార్జిలు వాట్సాప్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు సమస్యలు, పరిష్కరించినవి అప్డేట్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ యూసుఫ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. Miryalaguda : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

  2. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

  3. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  4. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  5. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు