Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!
Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ చరిత్రలోనే బంగారం ధర రికార్డ్ నెలకొల్పింది. తులం లక్ష రూపాయలు దాటేసింది. లక్ష రూపాయలకు చేరువ అవుతుందనుకున్న బంగారం ధర.. అది కూడా దాటేసింది. ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల బంగారం కు 30 వేల రూపాయలు పెరిగింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 10,13,500 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 9,29,000 రూపాయలు ఉంది.
తులం ఎంతంటే..?
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) బంగారం మంగళవారం ఎంతుందంటే..? 10 గ్రాముల బంగారం కు 3000 రూపాయలు పెరగడంతో 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 1,01,350 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 2750 రూపాయల పెంపుతో 92,900 రూపాయలకు చేరింది. హైదరాబాదు నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News :
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
-
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
-
Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!









