Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsఆరోగ్యం

Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వ్యాధి ఉన్నట్లే.. అవేంటో తెలుసుకుందాం..!

Diabetes: ఈ లక్షణాలు కనిపిస్తే షుగర్ వ్యాధి ఉన్నట్లే.. అవేంటో తెలుసుకుందాం..!

మన సాక్షి :

మధుమేహం ఈ రోజుల్లో సాధారణమైన దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. తీపి ఆహారాలు తినడం వల్లే డయాబెటిస్ వస్తుందనేది తప్పుడు అభిప్రాయం. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదా పనితీరు సరిగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ వ్యాధి వచ్చే ముందు లేదా వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి నిద్ర సమయంలో ఈ 5 లక్షణాలు డయాబెటిస్ సంకేతాలు కావచ్చు. వీటిని గమనిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోండి.

చెమటలు పట్టడం

రాత్రి చెమటలు పట్టడం రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటాన్ని సూచిస్తుంది. ఇతర లక్షణాలతో పాటు ఈ సమస్య ఉంటే, డయాబెటిస్ పరీక్ష చేయించుకోండి.

తరచూ మూత్రవిసర్జన

రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళ్లడం అధిక రక్త చక్కెర స్థాయిని సూచిస్తుంది. మూత్రపిండాలు అదనపు చక్కెరను తొలగించడానికి ఎక్కువగా పనిచేస్తాయి, దీనివల్ల తరచూ మూత్రవిసర్జన జరుగుతుంది.

అధిక దాహం

తరచూ మూత్రవిసర్జన వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది, దీనితో ఎక్కువ దాహం వేస్తుంది. ఎంత నీరు తాగినా దాహం తీరకపోవచ్చు, ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండవు.

తిమ్మిర్లు

రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాలు దెబ్బతిని, చేతులు, కాళ్ళలో జలదరింపు లేదా నొప్పి కలుగుతుంది.

రాత్రి ఆకలి

డయాబెటిస్ ఉన్నవారు రాత్రి భోజనం తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. ఇన్సులిన్ అసమతుల్యత వల్ల చక్కెర శక్తిగా మారకపోవడం దీనికి కారణం.

By : Santhosh, Hyderabad 

Similar News : 

  1. Diabetes : షుగర్ పేషంట్లు మామిడి పండ్లు తినొచ్చా..!

  2. Diabetes : వీటిని తగ్గించకపోతే డయాబెటిస్ ముప్పు..!

  3. Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే..?

  4. Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు