Hyderabad : హైదరాబాద్‌లోని పాత బస్తీలో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..!
Hyderabad : హైదరాబాద్‌లోని పాత బస్తీలో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని పాత బస్తీలో మీర్ చౌక్ సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఘటన స్థలంలోనే ముగ్గురు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 14 మంది చనిపోయారు. మొత్తం ఇప్పటివరకు 17 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో భవనంలో 30 మంది ఉండగా 17 మంది చనిపోయారు. మరికొందరు పరిస్థితి కూడా విషమంగా ఉంది.
ఆదివారం తెల్లవారుజామున కృష్ణ పెరల్స్ & మోడీ పెరల్స్ మొదటి అంతస్తులో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ కంప్రెసర్ పేలడంతో భారీ శబ్దాలతో వంటలు వ్యాపించాయి. ప్రమాదం రాత్రిపూట జరగడంతో గుర్తించే వరకు పొగ కమ్మేసింది. మంటలు, పొగ దట్టంగా రావడంతో ఊపిరాడక ప్రమాద స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు స్పృహ కోల్పోయిన వారిని ఉస్మానియా, యశోద, అపోలో, డిఆర్డిఓ ఆస్పత్రులకు తరలించారు.
బాధితులకు అండగా ఉంటాం – సీఎం రేవంత్ రెడ్డి
పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు, బాధితుల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆర్థిక సహాయం చేస్తాం – కిషన్ రెడ్డి
పాతబస్తీ ఘటనా స్థలానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. కేంద్రం బాధితులకు సహాయం అందించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇవి కూడా చదవండి :
-
TG News : ధాన్యం బస్తాలో డబ్బులు దాచిన రైతు.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్..!
-
Aadabidda Nidhi : ప్రతి మహిళకు నెలకు రూ.1500.. డైరెక్ట్ గా బ్యాంకు ఖాతాలోకి.. వెంటనే దరఖాస్తు చేయండి..!
-
TG News : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
-
TG News : తెలంగాణలో కొత్త పథకం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!
-
ATM : ఏటీఎం నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం..!









