TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు శుభవార్త..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ వినియోగాన్ని పెంచే విధంగా కేంద్రం చర్యలు చేపట్టింది. యూపీఐ.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇతర పేమెంట్ యాప్ ల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు డిస్కౌంట్లు అందించే ప్రణాళికను రూపొందిస్తుంది.

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లు చెల్లింపులు చేస్తే వ్యాపారులు రెండు లేదా మూడు శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ చార్జిగా చెల్లిస్తున్నారు. ఈ ఛార్జీలు వ్యాపారులకు ఆర్దిక భారంగా మారుతున్నాయి. అయితే యూపీఐ ద్వారా చెల్లింపులకు ఇలాంటి చార్జీలు ఏవి విధించకుండా ఉండే విధంగా కేంద్రం ప్లాన్ చేస్తుంది.

దాంతో యూపీఐ చెల్లింపులో మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదే సమయంలో యూపీఐ వినియోగదారులకు డిస్కౌంట్ల రూపంలో ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అయితే ఈ కొత్త విధానంతో యూపీఐ ద్వారా లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులు వస్తే దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరగనున్నది.

Similar News : 

  1. UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
  4. GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

మరిన్ని వార్తలు