Nalgonda : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు.. నిండా ముంచిన యూనిక్ కంపెనీ.. బాధితుల ఆందోళన..!
Nalgonda : అధిక వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయల వసూలు.. నిండా ముంచిన యూనిక్ కంపెనీ.. బాధితుల ఆందోళన..!
నల్లగొండ మే 26 మన సాక్షి.
అమాయక ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి వారి నుండి నెల నెల చిట్టి రూపంలో కోట్లాదిరూపాయలు, వసూలు చేసుకుని గడువు తీరి సంవత్సరాలు గడుస్తున్నా వారికి తిరిగి పొదుపు చేసిన డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తీపుతూ జనాన్ని నిండా ముంచింది యూనిక్ కంపెనీ. సోమవారం ఆ కంపెనీ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..
సుమారు 10 సంవత్సరాల క్రితం యూనిక్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజల నుండి నెలకు 300 నుండి 3000 వరకు పొదుపు పేరుతో ఏజెంట్లను పెట్టి వారి ద్వారా కోట్లాది రూపాయలను వసూలు చేసిన కంపెనీ మొదట కొన్ని సంవత్సరాలు డబ్బులు బాగానే ఇచ్చింది. దీంతో నమ్మిన ప్రజలు యునిక్ కంపెనీ లో చేరారు.
జిల్లా కేంద్రంలోని పూజిత అపార్ట్మెంట్లో యూనిక్ కంపెనీ ఒక ఆఫీసు ప్రారంభించి అందులో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి వివిధ గ్రామాలలో ఏజెంట్లను నియమించుకొని వారిని నమ్మించి వారి ద్వారా డిపాజిట్లు స్వీకరించారు, గోపులాయిపల్లి. నర్సింగ్ బట్ల, మాడుగులపల్లి వంటి అనేక గ్రామాలలో ఏజెంట్లు డబ్బులు ప్రజల నుండి డబ్బులు సేకరించి యూనిక్ కంపెనీలో డిపాజిట్ చేయించారు.
ఒక్కో ఏజెంట్ కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయించినట్లు తెలిపారు. నాలుగున్నర సంవత్సరాలు నెల నెల పొదుపు చేస్తే మరో రెండున్నర సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ కలిపి ఏడు సంవత్సరాలకు పొదుపు చేసిన మొత్తానికి వడ్డీ కలిపితిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే మొదట్లో ఒకటి రెండు సంవత్సరాలు చెల్లించినా పూర్తి గడువు దాటి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్న పొదుపు చేసిన వారికి యూనిట్ కంపెనీ తిరిగి డబ్బులు ఇవ్వటం లేదు.
ప్రజల నుండి డబ్బులు సేకరించి కంపెనీకి కట్టించిన ఏజెంట్ల బాధ వర్ణనాతీతము. గ్రామాలలో ప్రజల నుండి ఒత్తిళ్లు తీవ్రమై దాడులు చేసే పరిస్థితి వచ్చింది. ఏజెంట్లు గ్రామాలలో ఉండే పరిస్థితి లేదు. సోమవారం గోపలాయ్ పెళ్లికి చెందిన ఏజెంట్ ఉప్పల శ్రీనివాస్ బాధితులను తీసుకొని నల్గొండ ఆఫీసు కు వచ్చిడబ్బులు కావాలని ఒత్తిడి చేయగా అక్కడ ఉన్న సిబ్బంది తమకేమీ తెలియదు హైదరాబాదులో కంపెనీ జనరల్ మేనేజర్లు ఉంటారు వారిని కనుక్కోమని తెలిపారు.
ఏజెంట్లు బాధితులు మేనేజర్ కు ఫోన్ చేయగాకంపెనీకి చెందిన భూములు అమ్మకానికి పెట్టాము మార్చినాటికి అందరికీ డబ్బులు చెల్లిస్తామని ఫోన్లో చెప్పారు అయినా బాధితులు నమ్మటం లేదు ఇలాగనే నాలుగు సంవత్సరాల నుండి చెబుతున్నారని వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
అయితే ఇదే విధంగా నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, నిజాంబాద్ జిల్లాలో కూడా యూనిక్ కంపెనీ ప్రజలను మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం ప్రసార సాధనాలు ద్వారా అధిక వడ్డీ కి ఆశ పడి ప్రైవేట్ సంస్థలలో డిపాజిట్లు చేయొద్దని ఎంత ప్రచారం చేసిన ప్రజలు ప్రైవేట్ కంపెనీలలో డిపాజిట్లు చేస్తూ మోసపోతూనే ఉన్నారు.
MOST READ :
-
Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!
-
Elephant : గర్భంతో ఉన్న ఏనుగు మృతి.. కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలే కారణం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!
-
Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!









